అబ్దుల్ కలాం సేవలు.. చరిత్రలో చిరస్మరణీయం

by Shyam |
అబ్దుల్ కలాం సేవలు.. చరిత్రలో చిరస్మరణీయం
X

దిశ, పటాన్‌చెరు: మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం ఐదో వర్ధంతి సందర్భంగా పటాన్‌చెరు పట్టణంలోని ఆయన విగ్రహానికి సోమవారం బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళ్లర్పించారు. అనంతరం సంఘం నాయకులు బలరాం మాట్లాడుతూ.. ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేశారని తెలిపారు. ఇండియన్ మిస్సైల్ మాన్‌గా పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి, వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారని తెలిపారు. 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించారని అన్నారు. 2002 అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా, భారత రాష్ట్రపతిగా అందించినటువంటి సేవలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని తెలిపారు. అబ్దుల్ కలాం అడుగుజాడల్లో యువత నడిచి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆయన కోరారు.

Advertisement

Next Story

Most Viewed