మంత్రి పర్యటనలో ఉద్రిక్తత.. మహిళలపై బీజేపీ నేతల దాడి (వీడియో)

by Anukaran |   ( Updated:2021-12-24 23:34:18.0  )
BJP
X

దిశ, వెబ్‌డెస్క్ : తమ సమస్యను కేంద్ర మంత్రికి విన్నవించుకోవాలని వెళ్లిన మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. మహిళలు అని కూడా చూడకుండా బీజేపీ నేత, ఆయన కుమారుడు వారిపై దాడి చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో అమేథీలోని జైస్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. శుక్రవారం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. జైస్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక మహిళలు మంత్రికి తమ సమస్యలను చెప్పేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో ఆమె పర్యటనకు కొద్ది గంటల ముందు కొందరు మహిళలు అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జైస్ మున్సిపల్​అధ్యక్షుడు మహేశ్​శొంకర్, ఆయన తనయుడు భాను శొంకర్‌లు అక్కడికి చేరుకొని సదరు మహిళలను అడ్డుకొని వారిపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అక్కడి నుంచి పంపించి వేశారు.

ఈ నేపథ్యంలో బాధిత మహిళలు మీడియాతో మాట్లాడుతూ.. జైస్‌లోనే నీటి సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. బకెట్లతో నీరు నింపుకోవాల్సి వస్తోంది. ఇదే విషయాన్ని కేంద్రమంత్రికి వివరించాలని ఇక్కడికి వచ్చాము. ఇంతలో తండ్రీకొడుకులు మా మీద దాడి చేశారు. నా చెయ్యి పట్టుకుని లాక్కెళ్లి.. నాపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

Next Story