‘కవితను అనర్హురాలిగా ప్రకటించాలి’

by Shyam |
‘కవితను అనర్హురాలిగా ప్రకటించాలి’
X

దిశ, నిజామాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితను అనర్హురాలిగా ప్రకటించాలని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నర్సయ్య డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ.. నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో సమర్పించిన నామినేషన్ పత్రాల్లో కవిత తప్పుడు వివరాలను సమర్పించారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలనీ, అందులో నిజమని తేలితే ఆమె నామినేషన్‌ను తిరస్కరించి, ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పూర్తి ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ర్ట నాయకులు ధన్‌పాల్ సూర్య నారాయణ, పల్లె గంగారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఏప్రిల్ 7న జరగాల్సిన ఎన్నికలు కోవిడ్ -19 కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.

tags : BJP leaders, press conference, TRS mlc candidate, kavitha, disqualified, nizamabad

Advertisement

Next Story

Most Viewed