- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళిత బంధుపై బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారు : కర్ణబాబు
దిశ, అచ్చంపేట : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి దళితులంటే ఎప్పుడూ చిన్నచూపే.. ఈ క్రమంలోనే దళిత బంధు పథకాన్ని దళిత సామాజిక వర్గానికి అందకుండా కుట్రలు చేసి కేంద్ర ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసిందని టీఆర్ఎస్ మండల యువజన అధ్యక్షుడు ఆలూరి కర్ణబాబు ఆరోపించారు.
మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళిత బంధు ఇవ్వకూడదంటూ ఎంపీ బండి సంజయ్, ఈటల రాజేందర్ కలిసికట్టుగా ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాశారని ఆరోపించారు. అందులో భాగంగానే దళిత బంధును ఆపివేయాలని ఒత్తిడి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక అసమానతలతో వెనుకబడ్డ దళిత జాతి ఆర్థికంగా కోలుకున్నప్పుడే వెనుకబాటుతనానికి దూరం అవుతారని భావించి సీఎం కేసీఆర్.. తెలంగాణలో దళిత బంధును తీసుకువచ్చారని అన్నారు.
అది ఓర్వలేని బీజేపీ నేతలు దళితులకు మేలు జరగకూడదనే ఉద్దేశంతో హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని అమలు చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కాబట్టి తెలంగాణలో బీజేపీ నాయకులను గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. బీజేపీ నీచమైన రాజకీయాలకు హుజురాబాద్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు టీఆర్ఎస్ పార్టీ అమ్రాబాద్ మండల యూత్ కమిటీ ప్రధాన కార్యదర్శి రవికుమార్, జగన్, శివ, నరేష్, రఘుపతి, శ్యామ్, అఖిల్, అమరేందర్ పాల్గొన్నారు.