- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ గారు బాధ్యతగా వ్యవహరించండి : విజయశాంతి
దిశ, ఖైరతాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ తీవ్ర ఇబ్బందుల్లో ఉందని ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బీజేపీ నాయకురాలు విజయశాంతి సూచించారు. శనివారం శ్రీరామ్ నగర్‌లోని పట్టణ ప్రాథమిక కేంద్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారిని అక్కడ అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కరోనా విషయంలో కేసీఆర్ పలుమార్లు నిర్లక్ష్యంగా మాట్లాడారని మండిపడ్డారు. మీకు కరోనా సోకినప్పుడు యశోదాలో ఎందుకు చికిత్స తీసుకున్నారంటూ ప్రశ్నించారు.
పారాసిటమాల్ గోలితో కరోనా పోతుందని అబాధ్యతగా వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో ఎంతోమంది మృత్యువాతపడ్డారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పూర్తి ఉచితంగా అందిస్తున్నారని, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది జరక్కుండా చూసుకునేందుకు తమ పార్టీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ సెంటర్లను సందర్శించినట్లు చెప్పారు.