- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్‌పై స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు..
దిశ, వెబ్‌డెస్క్ : ఉద్యమనేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ సీఎం కేసీఆర్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నాయకులకు టీఆర్ఎస్‌లో సుముచిత స్థానం దక్కడం లేదని మండిపడ్డారు. దీంతో బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో స్వామిగౌడ్ కషాయ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్‌కు స్వామిగౌడ్ కౌంటర్ ఇచ్చారు. ‘సీఎం కేసీఆర్ నీకేం తక్కువ చేశారు.. శాసనమండలి చైర్మన్ చేశారు కదా.. అని గులాబీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తానేమీ రోడ్డుపై ఉంటే కేసీఆర్ తీసుకొచ్చి మండలి చైర్మన్ పదవి కట్టబెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు’. తాను చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు దంపతుల్లారా ముగ్గురు పిల్లలను కనండి అన్నందుకు సొంత పార్టీ నేతలే తనపై విరుచుకుపడ్డారని గుర్తు చేసుకున్నారు. అదే మాటను మళ్లీ ఇప్పుడు కూడా అంటున్నానని సవాల్ విసిరారు.
కొత్త బట్టలు కొనిచ్చాను.. వెనుక నుంచి తన్నుతా పడు అంటే ఎలా పడుతాను అని స్వామిగౌడ్ మండిపడ్డారు. అంతేకాకుండా తనను పోలీసులు రెండుసార్లు చంపేందుకు ప్రయత్నించారని చెప్పుకొచ్చారు. తన పదవికాలం పూర్తయ్యాక అధికారపార్టీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాలను మాజీ మండలి చైర్మన్ బహిర్గతం చేశారు. ప్రస్తుతం కారు పార్టీ నాయకులు, అధినేత సీఎం కేసీఆర్‌పై ఆయన చేసిన కామెంట్స్ పెనుదుమారం రేపుతున్నాయి.