- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రమంతటా జలకళ.. కానీ, ఇక్కడ నీరులేదు
దిశ, తుంగతుర్తి: ఇటీవల వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రమంతటా నీటితో కళకళలాడుతూ ఉంటే యాదాద్రి-భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం, మోత్కూరు మరియు ఆత్మకూరు (ఎం) మండలాలల్లో కనీసం పశువులకు నీరు తాగడానికి కూడా చుక్క నీరు లేకుండా ఎడారి ప్రాంతంలో కనిపిస్తోందని యాదాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్యామ్ సుందర్ రావు అన్నారు. సోమవారం ఆయన మోత్కూర్ మండల పరిధిలోని పునాదిగానీ కాల్వ పరిశీలనలో పాల్గోన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలు అందించామని.. సస్యశ్యామలంగా మారిందని గొప్పలు చెప్పుకునే ప్రజాప్రతినిధులు మరి ఈ మండలాల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. 16 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక రాష్ట్రం తెలంగాణలో కూడా అంతే నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దాసరి మల్లేశం, నర్సింగ్రావు, నరేందర్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు నాగార్జున రెడ్డి, బాయ్యని చంద్రశేఖర్, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ చార్జి కడియం రామచంద్రయ్య, మున్సిపల్ అధ్యక్షుడు బయ్యాని రాజు, సీనియర్ నాయకులు గౌరు శ్రీనివాస్, సజ్జనమ్ మనోహేర్, మండల అధ్యక్షుడు సోలిపురం లక్ష్మి నర్సింహ రెడ్డి, కిసాన్ మూర్చ నాయకులు బొట్టు అబ్బయ్య, జితేందర్ రెడ్డి, పోచం సోమయ్య, మారాజు అనిల్ కుమార్, ఆరే శ్రీనివాస్, మరాఠీ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.