కేంద్రం నిధులు మంజూరు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆలస్యం

by Shyam |
BJP leader Kanjarla Prakash
X

దిశ, మొయినాబాద్: అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు కేంద్రం విడుదల చేసిన నిధులతో త్వరగా నాలుగు లైన్ల రోడ్డు పనులు ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు కంజర్ల ప్రకాష్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని హిమాయత్‌నగర్ ఎక్స్‌రోడ్‌లోని కంజరర్ల ప్లాజాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌-బీజాపూర్ ఎన్-63 అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణకు కేంద్రం ప్రభుత్వం రూ.928.41 కోట్లతో నాలుగులైన్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేసిన ప్రధాని మోడీకి, మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నిధులున్నా.. నేటికీ పనులు ప్రారంభం కాకపోవడం బాధాకరమని అన్నారు. స్థానిక ఎంపీ రంజిత్ రెడ్డి స్పందించి పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, పాండురంగారెడ్డి, నాయకులు పల్లె శేఖర్‌రెడ్డి, కృష్ణాగౌడ్, వెంకట్ రాంరెడ్డి, వెంకట్ రెడ్డి, రాజ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed