ఎంఐఎం దేశద్రోహ పార్టీ : ప్రకాశ్ రెడ్డి

by Shyam |
ఎంఐఎం దేశద్రోహ పార్టీ : ప్రకాశ్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్‌ పార్టీపై బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎంఐఎం చెప్పిన పని చేస్తామని టీఆర్ఎస్ ఒప్పుకున్నట్టే అని, ఒప్పుకున్నారు కాబట్టే టీఆర్ఎస్‌కు జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు ఇచ్చిందని అన్నారు. అంతేగాకుండా కేంద్రం నిర్ణయాలకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని.. అవి జాతీయ రాజకీయాలు అని తెలిపారు. ఎంఐఎం దేశద్రోహ పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story