- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ సీఎం నాలుక కోస్తే రూ.11 లక్షలిస్తా.. బీజేపీ నేత సంచలన ప్రకటన
దిశ, డైనమిక్ బ్యూరో : రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం సహజమే. కానీ, ఏకంగా ప్రత్యర్థి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అవుతూ.. నాలుక కోసేసిన వారికి రివార్డు ప్రకటించడం దేశవ్యా్ప్తంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్ మోర్చా వ్యవస్థాపకులు జితన్ రామ్ మాంఝీ కొన్ని రోజుల క్రితం బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతరం తన వ్యాఖ్యలపై స్పందించి క్షమాపణలు కూడా చెప్పారు.
అయితే, జితన్ రామ్ వ్యాఖ్యలపై అంతర్జాతీయ హిందూ మహా సభ ప్రధాన కార్యదర్శి, బీహార్ బీజేపీ కార్యవర్గ సభ్యుడు గజేంద్ర ఝా తీవ్రంగా మండిపడుతున్నారు. బ్రాహ్మణులపై పదేపదే కించపరిచే, దూషించే వ్యాఖ్యలు చేయడం సహించేదిలేదని హెచ్చరించారు. అంతేకాకుండా, జితన్ రామ్ మాంఝీ నాలుకు కోసి తన దగ్గరకు తీసుకొస్తే రూ.11 లక్షలతో పాటు జీవితాంతం వారి ఖర్చులు భరిస్తానని గజేంద్ర ఝా ప్రకటించారు. గజేంద్ర ఝా చేసిన ప్రకటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
I would like to make an announcement. If any Brahmin chops off the tongue of Jitan Ram Manjhi and bring it before me, then I will reward him with Rs 11 Lakhs. Jitan Ram Manjhi, however, is not worth even 11 paise: BJP leader Gajendra Jha (20.12.2021) https://t.co/p2ESCJRiu3 pic.twitter.com/7sBI4tZyon
— ANI (@ANI) December 21, 2021