- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు
దిశ, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు రైతులు, కార్మికుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే.. ప్రభుత్వం వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. నల్గొండ జిల్లా పెద్దవూరలో బత్తాయి రైతుల వద్దకు వెళ్లిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కె. శ్రీధర్‌రెడ్డితో పాటు ఇతర నేతలపై లాక్‌డౌన్ ఉల్లంఘన నిబంధల కింద కేసులు నమోదు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. కరోనా వైరస్‌కు భయపడి ప్రతిఒక్కరు సురక్షితంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారని, ఇలాంటి సమయంలో బీజేపీ నేతలు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించే ప్రసక్తే లేదన్నారు. అటు నాగర్‌కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సుధాకర్‌రావు, మామిడి రైతులకు సంఘీభావం తెలిపితే పోలీసులు రెండు గంటలకు పైగా అదుపులోకి తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు.