- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబ్బులు చెల్లించాలనడం సిగ్గుచేటు.. బండి సంజయ్ ఆగ్రహం
దిశ, హుస్నాబాద్: 12 ఏండ్లు దాటినా గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులు పూర్తి కాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ఈ సందర్భంగా శనివారం సంగ్రామ యాత్రలో మాట్లాడారు. 2009లో గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారని, 1.14 టీఎంసీ నీటి సామర్థ్యంతో గౌరవెల్లి, 0.4 టీఎంసీ సామర్థ్యంతో గండిపెల్లి ప్రాజెక్టు పనుల కోసం రైతుల నుండి 1836 ఎకరాల భూమి సేకరించారన్నారు. నాడు ఒక్కో ఎకరాకు రూ.2లక్షల 15 వేల పరిహారం అందించారని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక రీడిజైన్ పేరుతో 2017లో 8.23 టీఎంసీల సామర్థ్యం పెంచుతూ పనులు ప్రారంభించిదన్నారు. దీంతో నిర్వాసితులనుంచి అదనంగా 2 వేల ఎకరాలు సేకరించగా, 7 గిరిజన తండాలు ముంపునకు గురయ్యాయని, అయినా.. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు.
సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు తర్వాత ప్రారంభించిన సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లోని రంగనాయక సాగర్, కొండ పోచమ్మ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేశారన్నారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు పనులు కూర్చీ వేసుకోని కూర్చొని పనులు చేపడాతమని గొప్పలు చెప్పి ఏండ్లు గడుస్తున్నా.. పనులు శూన్యమన్నారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వకుండానే, ఇండ్లను కూల్చివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. 18 ఏళ్ల పైబడిన పిల్లలు 300 పైచిలుకు ఉన్నారని వెంటనే రీసర్వే చేసి సాయమందిచాలన్నారు. గతంలో తోటపల్లి రిజర్వాయర్‌కు 1400 ఎకరాలు భూమిని సేకరించిన ప్రభుత్వం, ప్రాజెక్టును కట్టకుండా రద్దు చేసిందని, మా భూములు మాకివ్వాలని రైతులు డిమాండ్ చేస్తే, పరిహారం కింద ఎకరాకు రూ.9.50 లక్షలు చెల్లించామని, ఆ డబ్బులు చెల్లిస్తే మీ భూములు మీకు ఇస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. అలాంటప్పుడు గౌరవెల్లి, గండిపల్లి నిర్వాసితులకు 2021 మార్కెట్ రేటు ప్రకారం పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.
సారు.. నా కొడుకును మీరే కాపాడాలి
ఎనిమిదేళ్ల అబ్బాయి మణితేజకు చిన్నతనం నుంచే షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడని తల్లి పొన్నాల శంకర్ పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ఎదుట వాపోయారు. చలించి సంజయ్ కుమార్ షుగర్ వ్యాధి నయమయ్యేదాక కార్పొరేట్ వైద్యం అందిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. మణితేజ కాళ్లకు చెప్పులు లేని విషయాన్ని గమనించిన బండి సంజయ్ చెప్పులతోపాటు మంచి బట్టలు, పుస్తకాలు కొనుక్కోవాలంటూ ఆర్థికసాయం అందించడంతో తండ్రీకొడుకులు ఆనందంగా ఇంటికి వెళ్లిపోయారు.