రాజధాని మార్చే హక్కు జగన్‌కు లేదు: కన్నా

by Ramesh Goud |
రాజధాని మార్చే హక్కు జగన్‌కు లేదు: కన్నా
X

ఏపీ రాజధానిని మార్చే నైతిక హక్కు సీఎం జగన్‌కు లేదని బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యక్రమంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ,రాజధాని మార్పు అంశం రాష్ట్ర పరిధిలో అంశమని కేంద్రం ఎలాంటి జోక్యం చేసుకోదని కానీ, పార్టీపరంగా ప్రజాఉద్యమం ద్వారా తమ పోరాటాన్ని చేస్తామని వెల్లడించారు. రాజధాని మార్పు‌తో తప్ప మరే విషయంలోనూ టీడీపీతో కలిసి పనిచేయబోమని కన్నా స్పష్టం చేశారు. పౌరసత్వ బిల్లుపై కాంగ్రెస్, వామపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయనీ, ఈ బిల్లుపై అవగాహన చేసేలా కార్యక్రమాలు చేయనున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed