బిత్తిరి సత్తికి కరోనా..?

by Anukaran |   ( Updated:2020-08-15 07:16:50.0  )
బిత్తిరి సత్తికి కరోనా..?
X

తీన్‌మార్ వార్తలతో తెలంగాణలోని ప్రతీ ఇంట్లో ఓ కుటుంబ సభ్యుడిగా మారిపోయాడు బిత్తిరి సత్తి. తన యాసతో తెలంగాణ ప్రజానీకం మనసు గెలుచుకున్న బిత్తిరి సత్తి.. కొన్ని కారణాల వల్ల V6 చానల్‌ను వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత టీవీ9లో పని చేసిన సత్తి.. అక్కడ కూడా కొన్ని మిస్ అండర్‌స్టాండింగ్స్ రావడంతో తర్వాత సాక్షిలో జాయిన్ అయ్యారు. ‘గరం గరం’ అంటూ గరమున్న న్యూస్ చెప్తున్నాడు.

అయితే గత కొన్ని రోజులుగా ‘గరం గరం’ వార్తలతో బిత్తిరి సత్తి టీవీలో కనబడక పోయేసరికి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏం జరిగి ఉంటుందా? అనే ఆలోచనలో ఉన్నారు. అయితే సత్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతోనే తాను విధులకు దూరంగా హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా దీనిపై ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed