బిపిన్ రావత్ మృతి దేశానికి తీరని లోటు: సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి

by Shyam |   ( Updated:2021-12-09 06:01:15.0  )
bipin rawat
X

దిశ , మేడ్చల్: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక తో పాటు మరో 11 మంది మరణించడం బాధాకరమని మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం మేడ్చల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి ఆధ్వర్యంలో హరివర్ధన్ రెడ్డి బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… రావత్ అకాల మృతి రక్షణ దళాలకు, దేశానికి తీరని లోటని అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ బాల్ రెడ్డి, గౌడవేల్లి సర్పంచ్ సురేందర్, మండల యూత్ అధ్యక్షుడు రేగు రాజు, కౌన్సిలర్లు, మండల నాయకులు, వార్డ్ మెంబర్ల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story