- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హ్యాపీ యానివర్సరీ మై స్వీట్ లవ్ : బిపాసా
ఒకప్పటి బాలీవుడ్ హాట్ హీరోయిన్ బిపాసా బసు కరణ్ సింగ్ గ్రోవర్ ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. వీరిద్దరి వివాహం జరిగి ఏప్రిల్ 30కి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తన భర్తకు శుభాకాంక్షలు తెలిపిన బిపాసా… తన వివాహ వేడుక నుంచి స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది.
ప్రేమ కంటే గొప్ప ఎమోషన్ లేదన్న బిపాసా.. మరే ఇతర భావోద్వేగానికి ప్రేమను మించిన శక్తి లేదని చెప్పింది. నన్ను చాలా గొప్పగా ప్రేమిస్తున్న వ్యక్తితో ప్రతీ రోజు కలిసి జీవించడం ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు తెలిపింది. మనం రోజూ అనుభవించే చిన్న చిన్న ఆనందాలు జీవితంలో ఎలాంటి వెలితి లేకుండా చేస్తాయని… అలాగే ఉండాలని అంటోంది.
ఈ సందర్భంగా శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపిన బిపాసా… మా జీవితాన్ని ప్రేమ, నమ్మకం, విశ్వాసం, కృతజ్ఞతతో భర్తీ చేయడమే మా ధ్యేయం అని తెలిపింది. ప్రతీ రోజూ లవ్ ను సెలబ్రేట్ చేసుకోవాలని సూచిస్తోంది. సమయం చాలా వేగంగా పరుగెడుతోంది… ప్రతీ సెకన్ ను ఉత్తమంగా మలచుకోవాలని కోరింది. ఒకరినొకరు మంచి విషయాలు, భావాలను పంచుకుంటూ… అందమైన జ్ఞాపకాలుగా మలచుకోవాలని సూచించింది.
Tags : Bipasha Basu, Karan Singh Grover, Anniversary