- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు బయోడైవర్సిటీ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం
దిశ, న్యూస్‌బ్యూరో: బయోడైవర్సిటీ జంక్షన్‌లో రూ. 30.26 కోట్లతో నిర్మించిన ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. ఈ ఫ్లైఓవర్‌ను రేపు (గురువారం) పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించనున్నారు. 690 మీటర్ల పొడవున్న ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో కలిపి ఎస్ఆర్‌డీపీ ప్యాకేజి-4 కింద రూ. 379 కోట్ల వ్యయంతో జేఎన్‌టీయూ నుంచి బయోడైవర్సిటీ వరకు చేపట్టిన 12 కిలోమీటర్ల కారిడార్ పనులు మొత్తం పూర్తయ్యాయి. ప్యాకేజీ-4లో భాగంగా ఐదు పనులు గతంలోనే పూర్తయ్యాయి. 1) మైండ్ స్పేస్ అండర్ పాస్, 2) మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్, 3) అయ్యప్ప సొసైటి జంక్షన్ అండర్ పాస్, 4) రాజీవ్‌గాంధీ జంక్షన్ ఫ్లైఓవర్, 5) బయోడైవర్సిటీ జంక్షన్ లేవల్ -2 ఫ్లైఓవర్లను గతంలోనే ప్రారంభించారు. చివరగా జంక్షన్ లేవల్ -1 ఫ్లైఓవర్ ప్రారంభిస్తే ప్యాకేజీ పనులు మొత్తం పూర్తయినట్టేనని మేయర్ బొంతు రామ్మోహన్ వివరించారు. ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు రాయదుర్గ్ వెళ్లే వాహనదారుల ట్రాఫిక్ ఇబ్బందులు తొలుగుతాయని ఆయన తెలిపారు.
ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని రూ. 30.26 కోట్లతో ఎం. వెంకటరావు ఇన్ ఫ్రా ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్ చేపట్టింది. 2016 ఏప్రిల్ 2న ప్రారంభించిన పనులను 2020 మే 19న పూర్తయినట్టు జీహెచ్ఎంసీ తెలిపింది. ఈ ఫ్లైఓవర్ పొడవు 690 మీటర్లు కాగా.. వెడల్పు 11.50 మీటర్లు ఉంది. మూడు లేన్లలో వన్ వేలో మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. ఈ ఫ్లైఓవర్‌పై పీక్ అవర్‌లో 2019లో 22,400 పర్సనల్ వెహికిల్స్ ప్రయాణిస్తున్నాయని అంచనా వేయగా.. 2035 నాటికి వీటి సంఖ్య 30,678 వెహికిల్స్ ప్రయాణిస్తాయని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారు.