నానమ్మను అమ్మను చేశాడు.. అడ్డంగా దొరికిపోయాడు

by Shyam |
నానమ్మను అమ్మను చేశాడు.. అడ్డంగా దొరికిపోయాడు
X

దిశ, వరంగల్: తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఉద్యోగంలో చేరిన జనగామ మున్సిపల్ బిల్ కలెక్టర్ గణేష్ ను సస్పెండ్ చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ రీజినల్ డైరెక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం…. జనగామకు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు మణెమ్మ స్వచ్ఛంద పదవీ విరమణ చేయగా, ఆమె మనుమడు గణేష్ నానమ్మను అమ్మగా పేర్కొంటూ 2015లో జనగామ మున్సిపాలిటీ కార్యాలయంలో బిల్ కలెక్టర్ గా ఉద్యోగం పొందాడు. 1993లో జన్మించిన గణేష్ ఉద్యోగం కోసం 1997 గా తప్పుడు ధృవీకరణ పత్రాన్ని సృష్టించాడు. ఉద్యోగం రెగ్యులైజేషన్ కోసం ఇంటెలిజెన్స్ విభాగం జరిపిన విచారణలో తప్పుడు పత్రాలతో విధుల్లో చేరినట్లు గుర్తించిన అధికారులు ఆర్‌డీఎం కు నివేదిక అందజేశారు. ఈ మేరకు బిల్ కలెక్టర్ గణేష్ ను సస్పెండ్ చేస్తూ మున్సిపల్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed