- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మాలి హక్కుల పోరాటం కోసం మహా బైక్ ర్యాలీ
దిశ, బెజ్జూర్ : తెలంగాణ మాలి హక్కుల సాధన, పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం, కొమురం భీం జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో మహా బైక్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ బైక్ ర్యాలీ మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్యామ్ రావు సోమవారం ప్రారంభించారు. ఈ ర్యాలీ బెజ్జూర్ మండల కేంద్రం నుంచి చింతల మానేపల్లి, కౌటాల, సిర్పూర్ టీ కాగజ్నగర్ మండలాల మీదుగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ వరకు చేరుకుంటుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నెల్లూరు శ్యామ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో మాలి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్పించాలని డిమాండ్ చేశారు. ఎస్టీ జాబితాలో చేర్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. మాలి కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఎస్టీ జాబితాలో మాలీలను చేర్పిస్తే మాలీలకు భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వసంతరావు, మాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె రామకృష్ణ, బెజ్జూర్ ఉపసర్పంచ్ బాబురావు, మాలి సంఘం అధ్యక్షులు నందయ్య, వివిధ గ్రామాల మాలి కులస్తులు పాల్గొన్నారు.