బైక్ కారు ఢీ… ముగ్గురు మృతి

by srinivas |   ( Updated:2021-02-16 23:40:57.0  )
బైక్ కారు ఢీ… ముగ్గురు మృతి
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రశాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొదిలి మండలం తలమళ్ల కోల్డ్ స్టోరేజ్ వద్ద బైక్‌, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story