Bigg Boss 7 Telugu: 'ఇప్పుడేం చెప్పిన వర్కవుట్ అవదమ్మా' అంటూ.. దామినికి ఇచ్చిపడేసిన శివాజీ..?

by Prasanna |   ( Updated:2023-09-25 05:30:43.0  )
Bigg Boss 7 Telugu: ఇప్పుడేం చెప్పిన వర్కవుట్ అవదమ్మా అంటూ.. దామినికి ఇచ్చిపడేసిన శివాజీ..?
X

దిశ,వెబ్ డెస్క్: ఈ వారం లేడి కంటెస్టెంట్ దామిని ఎలిమినేట్ అయింది. దామిని జర్నీ మొత్తం టీవీలో చూపించారు నాగార్జున. దానిలో శివాజీ చెప్పిన డైలాగ్ మన సింగర్ పాపకి బాగా కనెక్ట్ అయినట్టుంది. ఆ వీడియోలో దామిని సేఫ్ గేమ్ ఆడుతుందంటూ శోభా శెట్టితో శివాజీ అంటాడు.వెంటనే వాదనకి దిగింది. శివాజీ సార్ నేను సేఫ్‌ గేమ్ ఆడుతున్నానని మీరు అన్నారు.. అలా అనడం కరెక్ట్ కాదంటూ దామిని అంటుంది.. అమ్మా.. నా ఉద్దేశం నువ్వు నీ సొంత గేమ్ ఆడట్లేదని.. అంటూ క్లారిటీ ఇస్తాడు. అప్పుడు సింగర్ పాప.. మీరు కొంతమందిని మాత్రమే బాగా పొగుడుతారంటూ అనేసింది.

ఈ మాటకి మన హీరో గారికి కోపం వచ్చి ఇచ్చిపడేశాడు.. ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా వేస్ట్ అమ్మా.. వర్కవుట్ కాదు .. ఇంటికెళ్లి బిగ్ బాస్ ఎపిసోడ్స్ మొత్తం చూసి ఇదే మాట చెప్పు.. అప్పుడు కూడా నా వైపు తప్పు ఉంటే .. నేను నీకు సారీ చెబుతా అంటూ శివాజీ అన్నాడు. ఇక చివరిగా బిగ్‌బాస్ గురించి తాను రాసి, కంపోజ్ చేసిన పాటను స్టేజ్ మీద పాడేసి దామిని వెళ్లి పోతుంది.

Read More about Bigg Boss Telugu season 7

Advertisement

Next Story

Most Viewed