- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg Boss Telugu 7: దుకాణం సర్దేసిన రతిక పాప.. శివాజీ అంత మాట అనేశాడేంటి..??
దిశ,వెబ్ డెస్క్: బిగ్‌బాస్ సీజన్-7లో తనకి రెండోసారి వచ్చిన అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయింది రతిక రోజ్. మొదటిసారి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చినప్పుడు నాలుగో వారం ఎలిమినేట్ అయిపోయింది. ఇక రీఎంట్రీలో అంతకంటే దారుణంగా ఆడి 12వ వారం ఎలిమినేట్ అయింది. అయితే మళ్లీ పోయిన సారి లాగే ఈ సారి కూడా హౌస్‌లో ఉండేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేసింది. పల్లవి ప్రశాంత్ దగ్గరున్న ఎవిక్షన్ పాస్‌ను తన కోసం ఉపయోగించాలని బతిమాలింది. కానీ రైతు బిడ్డ దీనికి ఏమాత్రం ఒప్పుకోలేదు. ఈ విషయంలో శివాజీని కూడా హెల్ప్ అడిగింది. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చివరికి రెండోసారి కూడా రతికకి నిరాశే మిగిలింది. మరి స్టేజ్ మీద ఒక్కొక్కరి గురించి రతిక ఏం చెప్పింది పూర్తిగా చూద్దాం.
ఇక ఊహించినట్లుగానే రతిక యూ ఆర్ ఎలిమినేటెడ్ అంటూ నాగాార్జున చెప్పేశారు. వెంటనే స్టేజ్ మీదకి వచ్చేయాలన్నారు. దీంతో హౌస్‌లో అందరికీ గుడ్ బై చెప్పేసింది రతిక. శివాజీ గట్టిగా హగ్ చేసుకొని ఏదీ ఎక్కువ ఆలోచించకు.. కెరీర్ మీద కాన్సట్రేషన్ పెట్టు అంటూ సలహా ఇచ్చాడు. ఇక స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి గురించి చెప్పింది రతిక. శివాజీ అన్నా..కంట్రోల్‌గా మాట్లాడు.. నిన్ను ఇలానే అన్నా అని పిలుస్తూ ఉంటాను.. నువ్వు అలానే వింటూ ఉండు.. అంటూ చెప్పింది. చివరిగా ప్రశాంత్ బాగా ఆడు.. నీకు నచ్చినప్పుడే ఎవిక్షన్ పాస్ యూజ్ చేసుకోమన రతిక అంది. థ్యాంక్స్ అక్కా.. సారీ అక్కా.. ఎవిక్షన్ పాస్ యూజ్ చేయలేకపోయా నీకు అంటూ ప్రశాంత్ అన్నాడు.
- Tags
- Bigg Boss 7