మళ్లీ లేడీస్ ఔట్.. ఏడో వారంలోనూ బిగ్ బాస్ హౌస్ నుంచి అమ్మాయే ఎలిమినేట్

by Nagaya |   ( Updated:2023-10-23 11:55:11.0  )
మళ్లీ లేడీస్ ఔట్.. ఏడో వారంలోనూ బిగ్ బాస్ హౌస్ నుంచి అమ్మాయే ఎలిమినేట్
X

దిశ, వెబ్‌డెస్క్ : బిగ్ బాస్ 7 సీజన్ ప్రారంభమై విజయవంతంగా ఏడు వారాలు పూర్తి చేసుకుంది. హౌస్ లో లేడీ, మేల్ కంటెస్టెంట్స్ తగ్గపోరుగా గేమ్స్ ఆడుతున్నారు. కానీ గత ఏడు వారాల నుంచి హౌస్ నుంచి వరుసగా అమ్మాయిలే ఎలిమినేట్ అవుతుండటం పట్ల తెలుగు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మేల్ కంటెస్టెంట్స్ తో సమానంగా గేమ్ ఆడుతున్నా.. లేడీసే ప్రతి వారం బయటకు వెళ్లిపోతుండటం గమనార్హం. మొదటి వారం కిరణ్ రాథోడ్ మొదలుకుని ఏడో వారం పూజా మూర్తి వరకు అందరూ అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు. ఇప్పటి వరకు కిరణ్ రాథోడ్, షకీలా, దామిని భట్ల, రతికారోజ్, శుభశ్రీ, నయని కాగా లేటెస్ట్ గా పూజా హౌస్ నుంచి బయటకు వచ్చారు.

ఏడోవారంలో పూజామూర్తి, అశ్విని, భోలే షా వళి డేంజర్ జోన్ లో ఉండగా..తక్కువ ఓట్లు వచ్చాయని పూజాను బిగ్ బాస్ బయటకు పంపించారు. పూజా హౌస్ లోకి వచ్చిన రెండో వారంలోనే ఎలిమినేట్ కావడం గమనార్హం. ఈ బుల్లి తెర నటి బిగ్ బాస్ హౌస్ లోకి స్టార్టింగ్ లోనే అడుగు పెట్టాల్సి ఉన్నా.. షో ప్రారంభానికి రెండు రోజుల ముందు ఆమె తండ్రి చనిపోయవడంతో ఆగిపోయింది. ఆ తర్వాత వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చినా.. రెండు వారాలకే హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది.

Advertisement

Next Story