శివాజీ వెళ్లిపోతే బిగ్ బాస్‌ షోను చూడగలుగుతారా..? (వీడియో)

by Nagaya |   ( Updated:2023-11-01 09:02:20.0  )
శివాజీ వెళ్లిపోతే బిగ్ బాస్‌ షోను చూడగలుగుతారా..? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : బిగ్ బాస్ 7 సీజన్ స్టార్టింగ్‌లో కొంత బోర్ కొట్టినా ఇటీవల రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటీ ఇచ్చిన కంటెస్టెంట్స్‌తో హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుంతుందోననే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరిగింది. లేడీ కంటెస్టెంట్స్, మేల్ కంటెస్టెంట్స్ మధ్య తగ్గపోరుగా గేమ్ నడుస్తోంది. ఇక ఇవాళ రిలీజైన ప్రోమోలో నాగార్జున మరింత ఉత్కంఠను పెంచారు. ముఖ్యంగా ప్రోమో చూశాక నాగార్జున హోస్టింగ్‌ని మెచ్చుకొని తెలుగు ఆడియెన్స్ ఉండరు. "నేను గర్వంగా చెప్తున్నా మా నాన్న ఊరోడు" అని నాగార్జున అన్నప్పుడు అందరికీ గూస్బంప్స్ వచ్చాయి. నాగార్జున మీద రెస్పెక్ట్ కూడా అంతే పెరిగింది. ఇవాళ ఎపిసోడ్‌లో నాగ్ ఇంటి సభ్యులందరికీ ఘోరంగా క్లాస్ పీకాడు. స్ట్రాంగ్‌గా వార్న్ చేశాడు. కుండబద్దలు కొట్టి కొన్ని నిజాలు మాట్లాడదాం అని మొదలు పెట్టి ఒక్కో సభ్యుడిని పైకి లేపి ప్రశ్నించాడు.

ఇక శివాజీ చేతినొప్పి కారణంగా అతన్ని బిగ్ బాస్ ఇంటికి పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శివాజీ బిగ్ బాస్ ముందు కూర్చుని కన్ఫెషన్ రూమ్‌లో బాగా ఏడ్చారు. అందరి ముందు నవ్వుతూ.. ఎవరూ లేనప్పుడు ఇలా బిగ్గరగా ఏడుస్తున్నానని చెప్పుకున్నాడు. తనకు ఇలా ఉండటం కష్టంగా ఉందని శివాజీ ఏడుస్తుంటే చూస్తున్న ఆడియన్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇక శివాజీ హౌస్‌లో న్యూట్రల్‌గా ఉంటూ ఎవరినీ నొప్పించకుండా మైండ్ గేమ్ ఆడుతున్నారు. కానీ ఆయన కొద్ది రోజులుగా హెల్త్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతూ గేమ్స్ ఆడలేకపోతున్నాడు. ఈ కారణంగానే శివాజీని బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. మరి శివాజీ వెళ్లిపోతే మీరు బిగ్ బాస్ షో ఎలా ఉండబోతుంది...? ఇప్పుడు ఉన్న రక్తి అప్పుడు ఉంటుందా..? ప్రేక్షకులు శివాజీ లేని షోను చూస్తారా.. లేదా.? ఇవన్నీ తెలియాలంటే ఇవాళ వచ్చే ఎపిసోడ్‌ను అస్సలు మిస్ అవ్వకండి.

Advertisement

Next Story