- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న శోభా సడన్‌గా టీవీ ప్రోగ్రామ్‌లోకి ఎలా వచ్చింది?
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై ప్రసారమయ్యే ‘కార్తీక దీపం’ సీరియల్‌లో మోనిత పాత్రలో నటించి ఫేమస్ అయ్యింది నటి శోభా శెట్టి. ఈమె నాగార్జున హోస్ట్ గా చేస్తోన్న తెలుగు బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్‌గా పాల్గొని తనదైన శైలిలో గేమ్ ఆడుతూ ప్రేక్షకుల వద్ద ఓటింగ్ దక్కించుకుంటుంది. శోభ దాదాపుగా 11 వారాల నుంచి బిగ్ బాస్ హౌజ్ లోనే కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ ఒక్కసారి కూడా ఎలిమినేట్ అవలేదు. హౌస్ నుంచి బయటకు రాలేదు. కానీ తాజాగా ఈటీవీ లేటెస్ట్ ప్రోగ్రామ్ ప్రోమోలో కనిపించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ఈటీవీ ఆలీతో ఆల్ ఇన్ వన్ పేరుతో వస్తోన్న రియాలిటీ షోలో శోభాశెట్టి పార్టిసిపేట్ చేసింది. తను పార్టిసిపేట్ చేసిన ఎపిసోడ్ నవంబర్ 21న ప్రసారం కానుంది.
తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఓ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో శోభాతో పాటు మరో ఇద్దరు మేల్ సెలబ్రిటీలు ఉన్నారు. ఈ ఎపిసోడ్ అందరూ చూడాలని.. ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ఈటీవీ ప్రోగ్రామ్ ఇలా చేసిందా? బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న శోభా సడన్‌గా ఈటీవీ ప్రోగ్రామ్‌లో ఎలా ప్రత్యక్షం అయింది? దాదాపు ఆమె 80 రోజులుగా హౌజ్‌లో ఉంది. అసలు బయటకు వచ్చే ఛాన్స్ లేదు. సీక్రెట్‌గా హౌజ్ నుంచి బయటకు వచ్చి ఈటీవీలో కనిపించిందా? అర్ధరాత్రి ఎవరి కంట పడకుండా వెళ్లిందా? లేదా నాగార్జున పర్మిషన్ తీసుకుందా? అని ప్రేక్షకులకు ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే నవంబరు 21 వ తేదీ వరకు ఎదురుచూడాల్సిందే.