BiggBoss -Season 7లో రెమ్యూనరేషన్‌ ఎక్కువ ఎవరు తీసుకుంటున్నారో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-09-14 09:22:38.0  )
BiggBoss -Season 7లో రెమ్యూనరేషన్‌ ఎక్కువ ఎవరు తీసుకుంటున్నారో తెలుసా?
X

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో ‘బిగ్‌ బాస్‌ సీజన్ 7’ ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. ఆరో సీజన్ అనుకున్న రీతిలో సక్సెస్ కాకపోవడంతో ఏడో సీజన్ ఎలాగైనా సూపర్ సక్సెస్ చేయాలని నిర్వాహకులు పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ సీజన్‌ను ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్‌తో ప్లాన్ చేశారు. ఆరంభం నుంచి ఎన్నో ట్విస్టులు.. సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. దీంతో ఈ సీజన్ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ క్రమంలోనే ఆడియన్స్‌లో ఇంటి సభ్యుల రెమ్యునరేషన్ ఎంత అంటూ క్యూరియాసిటీ మొదలైంది. అయితే వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే ఈ సీజన్‌లో అత్యధిక రెమ్యునరేషన్ శివాజీ తీసుకుంటున్నాడట. వారానికి నాలుగు లక్షలు ఇస్తున్నారట. ఆయన స్టార్‌డమ్ అండ్ పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ ఈ రేంజ్‌ రెమ్యూనరేషన్‌ను ఫిక్స్ చేశాడట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed