- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘‘బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలి’’.. నేరుగా సుప్రీంకోర్టుకు CPI నారాయణ విజ్ఞప్తి
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. బిగ్ బాస్ షో యువతను తప్పుదారి పట్టించేలా ఉందని.. ఈ కార్యక్రమంలోని సన్నివేశాలు నైతిక విలువలను నాశనం చేసేవిగా ఉన్నాయని ఆరోపించారు. అందువల్ల ఈ షో అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలని కోరారు. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైన నేపథ్యంలో మంగళవరం ఓ వీడియోను రిలీజ్ చేసిన నారాయణ.. బిగ్ బాస్ సంస్కృతి బీజేపీ సంస్కృతి ఒక్కటేనా అని ప్రశ్నించారు.
అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా బిగ్ బాస్‌పై పోలీసులు కేసులు కూడా నమోదు చేయడం లేదని.. కోర్టులను ఆశ్రయించినా బిగ్ బాస్ షో జోలికి పోవడం లేదన్నారు. బిగ్ బాస్ షో నిర్వాహకులు శక్తివంతులు కావడం వల్లే దీని జోలికి ఎవరూ వెళ్లడం లేదని ఆరోపించారు. అందువల్ల ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి సమాజాన్ని కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కాగా బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని నారాయణ గతంలోనూ అనేక సార్లు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.