Pallavi Prashanth : పరారీలో బిగ్‌బాస్-7 విన్నర్ . ఎక్కడున్నాడో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-12-20 05:34:09.0  )
Pallavi Prashanth : పరారీలో బిగ్‌బాస్-7 విన్నర్ . ఎక్కడున్నాడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ సీజన్-7 ఇటీవల ముగిసింది. ఇందులో విన్నర్‌గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, రన్నర్‌గా అమర్ దీప్ నిలిచారు. ఈ క్రమంలోనే వారు బయటకు వస్తుంటగా పెద్ద సంఖ్యలో వారి అభిమానులు జూబ్లీహిల్స్‌లో అన్నపూర్ణ స్టూడియో వద్ద భీబత్సం సృష్టించారు. అంతేకాకుండా అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కార్ల అద్దాలను పగలగొట్టారు. అమర్ దీప్ కారును కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగడమే కాక అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సులపై రాళ్లు విసిరారు.

దీంతో ఏకంగా ఆరు బస్సులు నాశనమయ్యాయి. ఒక పల్లవి ప్రశాంత్‌ను స్థానిక పోలీసులు బయటకు పంపించారు. అయినా అతడు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ విషయం తెలుసుకున్న ప్రశాంత్ ఫోన్ ఆఫ్ చేసి పారిపోయాడు. అతడి ఇంటికి చేరుకున్న పోలీసులు అనుచరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే ఫోన్ డేటాను సేకరించి పల్లవి ప్రశాంత్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టారు. కొమురవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో రైతు బిడ్డ దాక్కున్నట్టు గుర్తించారు. దీంతో అదుపులోకి తీసుకునేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపించారు.

Read More : నాగార్జునను అరెస్టు చేయాలి.. తెలంణాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు

Advertisement

Next Story

Most Viewed