బిగ్ బాస్ ప్రియాంకను ముద్దులు, కౌగిలింతల్లో ముంచెత్తిన ప్రియుడు.. పెళ్లి అప్పుడే అని చెప్పేశారు..

by Prasanna |   ( Updated:2023-11-11 16:32:34.0  )
బిగ్ బాస్ ప్రియాంకను ముద్దులు, కౌగిలింతల్లో ముంచెత్తిన ప్రియుడు.. పెళ్లి అప్పుడే అని చెప్పేశారు..
X

దిశ, సినిమా: వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడంలో సక్సెస్ అయింది. తెలుగులో ఆరో సీజన్‌ పూర్తి చేసుకుని ఏడో సీజన్‌‌లో టాప్ రేటింగ్‌తో దూసుకుపోతుంది. అయితే బిగ్ బాస్‌లో ఎన్ని టాస్క్‌లు చూసి ఎంజాయ్ చేసినప్పటికీ.. ఫ్యామిలీ మెంబర్స్ హౌజ్‌లోకి వచ్చే వారం మాత్రం ఎంతో ఎమోషనల్‌గా, ఆసక్తికరంగా ఉంటుంది. ఆడియన్స్‌ను కట్టిపడేస్తుంది. ఇక ఈ ఏడో సీజన్‌లో ఫ్యామిలీ వీక్‌ను పదో వారంలోనే తీసుకువచ్చారు నిర్వాహకులు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లకు ఎన్నో రకాల సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్.

ఇప్పటి వరకు శివాజీ, అశ్విని, అర్జున్, ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి రాగా.. ప్రియాంక కోసం తన ప్రియుడు శివ కుమార్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఇప్పటివరకు మిస్ అయిన ప్రేమనంత ప్రియుడిపై కురిపించేసింది ప్రియాంక. శివ కూడా అదే రేంజ్‌లో ముద్దులు, కౌగిలింతలతో ముంచెత్తాడు. ఇక చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పటివరకు పబ్లిక్‌గా ఎప్పుడూ పెళ్లి గురించి మాట్లాడలేదు. కానీ ఈ ప్రోమోలో పెళ్లి ఎప్పుడు చేసుకుందామని ప్రియాంక అడగ్గానే.. నువ్వు బయటకురాగానే చేసేసుకుందాం’ అంటూ శివ ఆన్సర్ ఇచ్చాడు. లేదు ఇప్పుడే చేసుకుందాం.. ఇక్కడే అంటూ ప్రియాంక ఏడ్చేసింది. కాగా ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed