ఈ వారం ఎవడినో ఒకడిని కొట్టి వెళ్లిపోతా.. హౌస్ మేట్స్‌పై శివాజీ ఫైర్

by sudharani |   ( Updated:2023-10-25 06:49:58.0  )
ఈ వారం ఎవడినో ఒకడిని కొట్టి వెళ్లిపోతా.. హౌస్ మేట్స్‌పై శివాజీ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: సక్సెస్ ఫుల్‌గా ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదొవ వారంలోకి అడుగు పెట్టారు హౌస్ మేట్స్. ఇక లాస్ట్ వారం పూజ ఎలిమినేట్ కాగా.. ఈ వారం నామినేషన్ ప్రక్రియ బుర్ర హీటెక్కెరేంజ్‌లో సాగింది. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు మొత్తం 8 మంది (శోభా శెట్టి, భోలే షావలి, శివాజీ, అశ్విని శ్రీ, ప్రియాంక జైన్, అమర్ దీప్, సందీప్, గౌతమ్) సభ్యులు నామినేట్ అయ్యారు. ఇక ఎప్పటి లాగే నామినేషన్ ప్రక్రియ జరిగినప్పుడు ఏం మాట్లాడని శివాజీ.. ప్రక్రియ ముగిసిన తర్వాత యావర్, రతికల దగ్గర హౌస్ మేట్స్‌పై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ‘దొంగలు.. దొంగ దొంగ అని పరిగెట్టిస్తున్నారే.. చూస్తారు. ఇప్పుడున్న జనాలు, మనుషులు, ప్రజలు అనే వాళ్లు ఉంటే చూస్తా ఈ వారం. ఈ వారాన్ని బట్టి ఈ హౌస్‌లో ఉంటా. లేదంటే వాలంటిర్‌గా ఎవడినో ఒకడిని కొట్టి వెళ్లిపోతా’ అంటూ ఫైర్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story