బిగ్ బాస్‌లో రాజకీయాలు.. కత్తిపోట్లకు బలయ్యేది ఎవరు..?

by sudharani |   ( Updated:2023-11-11 16:27:54.0  )
బిగ్ బాస్‌లో రాజకీయాలు.. కత్తిపోట్లకు బలయ్యేది ఎవరు..?
X

దిశ, వెబ్‌డెస్క్: తొమ్మిది వారాలు సక్సెస్ ఫుల్ కంప్లీట్ చేసుకుని పదో వారం లోకి ఎంట్రీ ఇచ్చారు హౌస్ మేట్స్. గత వారం టేస్టీ తేజ ఎలిమినేట్ కాగా.. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ షురూ చేశాడు బిగ్ బాస్. ఇక ఉల్టా పుల్టా రీతిలో.. గత ఎన్నడూ లేని విధంగా ఈ వారం నామినేషన్స్ ప్రక్రియను చేపట్టాడు బిగ్ బాస్. ‘ఈ సారి నామినేషన్స్ ప్రక్రియ బిగ్ బాస్ మహా రాజ్యంలో జరుగుతుంది. ఈ రాజ్యానికి శోభ శెట్టి, ప్రియాంక, రతిక, అశ్విని నలుగురు రాజమాతలు. వారి నిర్ణయమే తుది నిర్ణయం’ అంటూ నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ చేయమంటాడు బిగ్ బాస్.

దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా.. నామినేషన్ ప్రక్రియను అర్జున్, అమర్ దీప్ స్టార్ చేయగా.. అమర్ తన ఫస్ట్ నామినేషన్ బోలే అని చెప్తూ ‘మీరు వీక్ కంటెస్టెంట్‌గా ఒప్పుకుని రావడం నాకు నచ్చలేదు’ తన రీజన్ చెప్తాడు. దీనికి బోలే.. అక్కడ కొన్ని రాజకీయాలు పులుముకున్నాయంటూ తను సమాధానం ఇస్తాడు. ఎన్ని రాజకీయాలు, కుట్రలు జరిగినా మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోవాలి అంటాడు అమర్. ఇక వీళ్లిద్దరి వాదన జరిగిన అనంతరం.. శివాజీ, గౌతమ్‌ల మధ్య నామినేషన్స్ డిస్కషన్ సాగింది. ఈ క్రమంలోనే మరోసారి శివాజీ నీతి, న్యాయం అంటూ పంచభూతాల సాక్షిగా చెప్తున్నా అని వాదిస్తాడు. సినిమా రేంజ్‌లో సాగిన ఈ నామినేషన్స్‌లో కత్తిపోట్లకు బలయ్యి నామినేషన్స్‌లో ఉండేది ఎవరో తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed