Bigg Boss-7: ఈరోజు మీరు ఊహించనివి ఎన్నో జరగబోతున్నాయంటున్న నాగ్.. ఇంట్రెస్టింగ్‌గా లేటెస్ట్ ప్రోమో (వీడియో)

by Hamsa |   ( Updated:2023-10-10 06:07:10.0  )
Bigg Boss-7: ఈరోజు మీరు ఊహించనివి ఎన్నో జరగబోతున్నాయంటున్న నాగ్.. ఇంట్రెస్టింగ్‌గా లేటెస్ట్ ప్రోమో (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్-7 రియాలిటీ షో రోజు రోజుకు ఎంతో ఆసక్తికరంగా మారుతుంది. ప్రేక్షకులు ఊహించని విధంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు షాకిలిస్తున్నాడు. తాజాగా, నేడు ఆదివారం ఎపిసోడ్ 2.0 వేరే లెవెల్ అంటూ నాగ్ చెప్పడంతో సాయంత్రం ఎప్పుడవుతుందా.. అని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడూ సేఫ్ చేసేవారితో స్టార్ట్ అయ్యే ఎపిసోడ్.. ఈరోజు ఎలిమినేషన్‏తో మొదలవుతుంది నాగార్జున అంటారు. బిగ్‏బాస్‏ హౌస్ లో ఐదు వారాలు.. ఇప్పటికే ఇంట్లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో టాప్ కంటెస్టెంట్ ఎవరు అని అడగ్గా.. ముందుగా అమర్ దీప్.. ప్రశాంత్ పేరు చెప్పారు. దీంతో హౌస్ మేట్స్ లేదు అని మిగతా సభ్యులు అనగా.. ముందు అర్థం చేసుకోవాలి అమర్ అన్నారు.‏ ఇక తర్వాత శివాజీ.. యావర్ పేరు చెప్పారు. అలాగే ప్రియాంక మరొకరి పేరు చెప్తుండగా..ఐదు వారాల్లో అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు నాగ్.

ఇక తర్వాత గౌతమ్, యావర్ శివాజీ పేరు చెప్పారు. అలాగే టేస్టీ తేజ.. ప్రియాంక పేరు చెప్పారు. ఆ తర్వాత నామినేషన్ లో ఉన్నవారిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది కన్ఫార్మ్ డ్ హౌస్ మేట్స్ డిసైడ్ చేయనున్నారని అన్నారు. ఆ తర్వాత శోభా శెట్టి ఇద్దరిని సేవ్ చేయాలని ఉందని అనగా.. ఇప్పటికే ఐదు వారాలు పూర్తయ్యాయని.. ఇక సేఫ్ గేమ్ ఆడొద్దని హెచ్చరించారు నాగ్. ఆ తర్వాత నామినేషన్ లో ఉన్న ఇంటి సభ్యులను యాక్టివిటీ రూంకు పిలిపించారు. ఎలిమినేట్ అయిన సభ్యుడు అటు నుంచి అటే వెళ్లిపోతారని అన్నారు.

ఆ తర్వాత చీకటి గదిలో నామినేట్ అయిన సభ్యులను తీసుకెళ్లగా ఘోస్ట్ గెటప్ లో ఉన్న ఓ వ్యక్తి ఎలిమినేట్ అయ్యే సభ్యుడిని సెలెక్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు గెస్టులుగా రవితేజ, సిద్దార్థ్ వస్తారు. సిద్దార్థ్ మాత్రం ఇంట్లోకి వెళ్లి కంటెస్టెంట్స్‌తో పలు గేమ్స్ ఆడతాడు. ఆ తర్వాత నాగ్ ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టా.. ఇవాళ ఈవెంట్ వేరే లెవల్ అంటూ చెప్పడంతో వీడియో కంప్లీట్ అవుతోంది. ఈ సారి వెరైటీగా ఎలిమినేషన్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా నేడు నలుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఒక ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed