- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బాస్ హౌజ్‌లో షాకింగ్ ఇన్సిడెంట్.. కంటెస్టెంట్లకు వణుకు పుట్టించిన టాస్క్
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ సీజన్‌లో 4వ పవర్ అస్త్ర కోసం పోటీ స్టార్ట్ అయ్యింది. ఇందులో అర్హత పొందడం కోసం బిగ్ బాస్ కాయిన్స్ టాస్క్ నిర్వహించాడు. ఈ టాస్క్‌లో శివాజీ, సందీప్, శోభా శెట్టి బ్యాంకర్లుగా వ్యవహరించారు. ఒక్కో బ్యాంకర్ వద్ద పదివేల విలువ చేసే కాయిన్స్ ఉంటాయి. ఒక్కో కాయిన్ విలువ 100. కాగా బ్యాంకర్లు ఆ కాయిన్స్‌ను ఇతర కంటెస్టెంట్లకు ఇవ్వాలి. ఇలా తేజ 51, రతిక 35, గౌతమ్ 24, ప్రియాంక 41, శుభ శ్రీ 31, ప్రశాంత్ 33, అమర్ 41, యావర్ 43 కాయిన్స్ పొందుతారు. తర్వాత బిగ్ బాస్ చెప్పగానే బజర్ నొక్కడానికి పోటీ పడతారు. అందులో ఫస్ట్ అమర్ దీప్ ముందుగా బజర్ నొక్కుతాడు. ఇప్పుడు అమర్ పార్ట్నర్‌గా గౌతమ్‌ను, పోటీ దారులుగా రతిక, తేజను ఎంచుకుంటాడు.
ఇక ఈ రెండు జంటల మధ్య పోటీ స్టార్ట్ అవుతుంది. ఒక జంట శివాజీ వద్దనున్న కెమెరా వద్దకు వెళ్లి.. ఫోజులు ఇస్తుండగా.. మరో జంట వారిని ఎక్కువ ఫొటోలు దిగకుండా ఏదోటి చేసి అడ్డుకోవాలి. ఫోటోలు దిగడానికి ప్రయత్నించే జంట నడుముకి బెల్ట్ కడతారు. ఆ బెల్ట్‌ను పట్టుకుని మాత్రమే మరో జంట వారిని అడ్డుకుంటారు. ఈ టాస్క్‌లో అమర్ దీప్, గౌతమ్ జంట గెలుస్తారు. గౌతమ్ ఫోటోల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు తేజ అతడిని అడ్డుకునే క్రమంలో మెడకు బెల్ట్ వేసి లాగుతాడు. తేజ చేసిన పనికి హౌస్‌లోని మిగతా సభ్యులంతా భయబ్రాంతులకు గురయ్యారు. ఆట ముగిశాక ఆ విధంగా మెడకు బెల్ట్ వేయడం ఏంటి? అంటూ తేజని కంటెస్టెంట్లు అడుగుతారు.