- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BIGBOSS: గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్న బిగ్ బాస్.. పోలీసుల రాకతో గుట్టురట్టు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇక ఈ కరోనా వలన అన్ని రాష్టాల్లో లాక్ డౌన్ అమలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ లు, టీవీ షూటింగ్‌లను కూడా నిలిపివేశారు. అయితే లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి మలయాళ బిగ్ బాస్ రియాలిటీ షో నిర్వాహకులు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ ని కానిచ్చేస్తున్నారు. మలయాళంలో మోహన్ లాల్ వ్యాఖ్యాతగా బిగ్ బాస్ సీజన్ 3 నడుస్తున్న విషయం తెలిసిందే.. ఫిబ్రవరిలో 14 మందితో ప్రారంభమైన బిగ్ బాస్ మలయళం 3 షోలో ప్రస్తుతం ఏడుగురు సభ్యులే ఉన్నారు. ఇప్పటికే 95 రోజులు ముగిశాయి. ఇటీవలే మరో రెండు వారాల పాటు షోను పొడిగించారు.
అయితే, ఈ క్రమంలోనే కేరళ, చెన్నైలో లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో షూటింగ్ వాయిదా వేశారు. కానీ పైకి వాయిదా వేసినట్లు చెప్తూ.. చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీలో ప్రత్యేక సెట్ వేసి షూటింగ్ నడిపించేస్తున్నారు. ఇప్పటీకే ఆ సెట్ లో 8మంది సిబ్బంది కరోనా బారిన పడగా.. అవేమి లెక్కచేయకుండా షూటింగ్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారం కాస్తా పోలీసుల దృష్టికి రావడంతో వారు చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్‌సిటీలో బిగ్‌బాస్ సెట్‌కు వెళ్లి చిత్రీకరణను నిలిపివేశారు. సెట్‌ని సీల్ చేసి హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌తో పాటు కెమెరామెన్లు, టెక్నీషియన్లు అందరిని పంపించేశారు. అయితే, ఇంత జరిగినా జూన్ 4 న జరిగే గ్రాండ్ ఫినాలే ని ఆపకుండా కొనసాగించే పనిలో ఉన్నారట నిర్వాహకులు..