- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
132 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులు
by Shyam |

X
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. గురువారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో 132 మందికి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ.. తనను రెండోసారి రికార్డు మెజారిటీతో గెలిపించిన నగర ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. కళ్యాణలక్ష్మీతో పాటు తన తరుపుణ పెళ్లి కూతురుకి చీర, పెళ్లి కొడుకుకి ఒక జత బట్టలు కానుక ఇస్తున్నానని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఈ బట్టలు పంపిణీ చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీతూకిరణ్, సుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మార్వో నీలకంఠం, స్థానిక కార్పొరేటర్‌లు పాల్గొన్నారు.
Next Story