ఉప ఎన్నిక వేళ కేసీఆర్‌కు బిగ్ షాక్.. ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ

by Anukaran |
cm-kcr-shock
X

దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. హుజురాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్న ‘దళిత బంధు’ను ఎన్నికల నేపథ్యంలో నిలిపివేయాలని ఆదేశించింది.

అంతేకాకుండా రాష్ట్రంలో అమలు చేస్తున్న దళితబంధును వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఉపఎన్నిక తర్వాత దళితబంధును యథావిథిగా కొనసాగించుకోవచ్చునని తెలిపింది. ఎన్నికలు ఉన్నందున ఓటర్లు ప్రలోభాలకు గురయ్యే అవకాశం ఉందని.. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Advertisement

Next Story