- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముఖేష్ అంబానీకి భారీ షాకిచ్చిన అమెజాన్..
దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ రిటైల్ మధ్య ఒప్పందంపై సవాల్ చేస్తూ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ వేసిన పిటిషన్‌పై అనుకూల తీర్పు వెలువడింది. రిలయన్స్‌లో ఫ్యూచర్ రిటైల్ విలీనంపై ముందుకెళ్లకూడదని సింగపూర్ ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు భారత్‌లో కూడా అమలవుతాయని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది. ఫ్యూచర్ గ్రూప్ సంస్థకు చెందిన రిటైల్, లాజిస్టిక్స్, హోల్‌సేల్ సహా ఇతర వ్యాపారాలను కొనేందుకు రిలయన్స్ రిటైల్ గతేడాది రూ. 24,713 కోట్ల విలువైన ఇప్పందం చేసుకుంది.
అయితే, ఫ్యూచర్ గ్రూప్ సంస్థకే చెందిన ఫ్యూచర్ కూపన్స్ లిమిటెడ్‌లో అమెజాన్ 2019లో 49 శాతం విలువైన పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్ కూపన్స్‌కు ఫ్యూచర్ రిటైల్‌లో 7.3 శాతం వాటా ఉండటంతో 3-10 ఏళ్లలోపు ఫ్యూచర్ రిటైల్‌ను కొనేందుకు అమెజాన్‌కు హక్కులు లభించాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ రిటైల్-ఫ్యూచర్ మధ్య జరిగిన ఒప్పందం ఈ హక్కుల నిబంధనల ఉల్లంఘన అని అమెజాన్ ఆరోపించింది. దీనిపై సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టుకెళ్లింది.
అక్కడి కోర్టు ఈ ఒప్పందంపై స్టే ఇచ్చింది. తుది తీర్పు వచ్చే వరకు ఒప్పందంపై ముందుకెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఫ్యూచర్ గ్రూప్ సంస్థ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లగా, ఏకసభ్య ధర్మాసనం ముందు అమెజాన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై మళ్లీ ఫ్యూచర్ గ్రూప్ సంస్థ అదే కోర్టులో సవాల్ చేయగా ఒప్పందంపై ముందుకెళ్లొచ్చని వెల్లడించింది. అనంతరం అమెజాన్ ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సింగపూర్ ఆర్బిట్రేటర్ కోర్టు తీర్పు ఇక్కడ కూడా చెల్లుబాటవుతుందని స్పష్టం చేసింది.