- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్.. రోజాకు తృటిలో తప్పిన విమాన ప్రమాదం.. టెన్షన్‌లో YCP (వీడియో)
దిశ, ఏపీ బ్యూరో : రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానంకు ల్యాండింగ్ సమస్య తలెత్తింది. తిరుపతి ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేసేటప్పుడు డోర్స్ ఓపెన్ కాలేదు. దీంతో ఇండిగో ఫ్లైట్ గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో విమానాన్ని బెంగళూరు ఎయిర్‌పోర్టులో సిబ్బంది ల్యాండ్ చేశారు. ఈ విమానంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఉన్నారు. వాతావరణ సమస్యా లేక సాంకేతిక సమస్య అనే విషయంలో స్పష్టత ఇవ్వడం లేదని యనమల రామకృష్ణుడు తెలిపారు.
అయితే ఇండిగో సిబ్బంది సమాధానంపై ప్రయాణికులు అసంతృప్తి వెళ్లగక్కారు. ఫ్లైట్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయాణికుల నుంచి ఇండిగో సిబ్బంది అదనపు రుసుము డిమాండ్ చేసింది. యాజమాన్యం తప్పిదానికి తామెందుకు డబ్బులు కట్టాలని ప్రయాణికులు మండిపడ్డారు. బెంగళూరు నుంచి గమ్యం స్థానాలకు చేరేందుకు ప్రయాణికులు సొంత ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు ఈ అంశంపై ఎమ్మెల్యే రోజా సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేవని.. డోర్స్ మాత్రం ఓపెన్ కావడం లేదని వీడియోలో స్పష్టం చేశారు.