Big boss:రవి నన్ను వాడుకొని వదిలేశాడు.. ప్రియాంక సింగ్ సంచలన వ్యాఖ్యలు

by Shyam |   ( Updated:2021-09-24 05:35:19.0  )
Big boss:రవి నన్ను వాడుకొని వదిలేశాడు.. ప్రియాంక సింగ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. కొన్ని టాస్క్ లలో కంటెస్టెంట్లు హద్దులు మీరినా మిగతా సమయాలలో ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తున్నారు. ఇక తాజా ఎపిసోడ్ లో తొలి ప్రేమను తలుచుకునే అవకాశాన్ని బిగ్‌బాస్‌, కంటెస్టెంట్లకు కల్పించిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు తమ తొలిప్రేమ తీపి గుర్తులను నెమరువేసుకున్నారు. ఇంకొంతమంది తమ ప్రేమ ఎలా విడిపోయిందో తెలిపి బాధపడ్డారు. అందులో ముఖ్యంగా ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ ప్రేమ కథ అందరి మనసులను కలిచివేసింది. తన మొదటి ప్రేమికుడిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

తన తొలిప్రేమ కథను ప్రియాంక తెలుపుతూ” ఒక ఫంక్షన్‌లో రవి అనే అబ్బాయిని చూశాను. అక్కడే పరిచయం అయింది. పరిచయం అయిన కొన్ని రోజులకే అది ప్రేమగా మారింది. ఒకరినొకరు అర్ధం చేసుకోవడం, నా పరిస్థితి తెలిసి కూడా అతడు నాతో ఉంటాను అనడంతో అతనే నా జీవితం అనుకున్నాను. ఆ ధైర్యంతోనే ఇద్దరం బాగా క్లోజ్ అయ్యాం. దాదాపు ఆరేళ్లు రిలేషన్‌లో ఉన్నాం. అతనికోసమే నా జెండర్‌ని ఛేంజ్ చేసుకుని.. అతడిని కలిసి నువ్వంటే నాకిష్టం.. పెళ్లి చేసుకుందామని కోరాను. కొన్నిరోజులు బాగానే ఉన్నా ఆ తరువాత ఒకరోజు రవి మా ఇంటికి వచ్చి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు.. నేను మా తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. ఆ మాటతో నేను షాక్ అయ్యాను. నాతో పెళ్లికి ఓకే అన్నావు కదా అన్న విషయాన్ని గుర్తు చేస్తే నువ్వేమైనా అమ్మాయివా? నీకేమైనా పిల్లలు పుడతారా? ఏం మాట్లాడుతున్నావు? పెళ్లంటావేంటి? ఉన్నన్నినాళ్లు ఉందాం అంటూ చిరాకు పడ్డాడు. దాంతో నేను తట్టుకోలేకపోయాను.

నాకూ అమ్మ కావాలని ఉంది, అందుకోసం చాలా ఆసుపత్రులు తిరిగి కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను. కానీ, అది సాధ్యం కాలేదు. అతనిని ఎంతో ప్రేమించాను.. కానీ, చివరకు తను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నన్ను వదిలి వెళ్లొద్దని కాళ్లు పట్టుకొని బతిమిలాడాను, బైక్ వెనుక పిచ్చిదానిలా పరిగెత్తాను. అతను నా మాట వినలేదు. తన దారి తనే చూసుకుని నన్ను మోసం చేశాడు. వాడుకుని నడి రోడ్డుపైన వదిలేశాడు. అయినప్పటికీ అతడు హ్యాపీగా ఉంటే చాలు. అతడి సంతోషమే నాకు కావాలి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియాంక లవ్ స్టోరీ నెట్టింట వైరల్ గా మారింది. ట్రాన్స్ జెండర్స్ కి కూడా ఒక మనసు ఉంటుంది. వారు కూడా ప్రేమించగలరు.. వారి ఫీలింగ్స్ కి మనం గౌరవమివ్వాలి అంటూ నెటిజన్లు ప్రియాంకకు సపోర్ట్ చేస్తున్నారు.

Advertisement

Next Story