ఐటెం బాంబ్‌కు సల్మాన్ ఖాన్ ఫైనాన్షియల్ సపోర్ట్

by Jakkula Samataha |   ( Updated:2021-02-26 08:30:03.0  )
ఐటెం బాంబ్‌కు సల్మాన్ ఖాన్ ఫైనాన్షియల్ సపోర్ట్
X

దిశ, సినిమా : బిగ్ బాస్ 14 కంటెస్టెంట్ రాఖీ సావంత్ తల్లి జయ.. ప్రస్తుతం హాస్పిటల్‌లో క్యాన్సర్‌కు చికిత్స పొందుతోంది. వైద్యానికి సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్ ఆర్థికంగా సహకరిస్తుండగా ధన్యవాదాలు తెలిపింది రాఖీ. ఈ క్రమంలో జయ ఆరోగ్యం గురించి అప్‌డేట్ ఇచ్చింది. ఆరు కీమోథెరపీ సెషన్లకు గాను నాలుగు కంప్లీట్ కాగా.. తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో తల్లి థాంక్స్ వీడియోను రిలీజ్ చేసింది. ‘నా కొడుకులు సల్మాన్, సోహైల్‌కు ధన్యవాదాలు. ప్రస్తుతం ఆస్పత్రిలో కీమోథెరపీ చేయించుకుంటున్నాను. మరో రెండు సెషన్స్ పూర్తి కాగానే ఆపరేషన్ చేస్తారు. మీరు ఎప్పుడూ సురక్షితంగా ఉండాలని, మీకెప్పుడూ విజయం కలగాలని దేవుడిని కోరుకుంటున్నా’ అంటూ రాఖీ తల్లి వీడియోలో పేర్కొంది.

Advertisement

Next Story