- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పండుగ సీజన్ అమ్మకాల్లో ఫ్లిప్‌కార్ట్ జోరు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్ కోసం ప్రారంభించిన ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌లో భారీగా అమ్మకాలు జరిగాయని కంపెనీ ప్రతినిధి నందిత సిన్హా చెప్పారు. ప్రధానంగా టైర్3, ఇతర చిన్న పట్టణాల నుంచి బలమైన డిమాండ్ చూశామని, ఇవి దాదాపు సగం(45) ఆర్డర్లకు దోహదపడ్డాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కొవిడ్ మహమ్మారి ప్రభావం కారణంగా ఆన్‌లైన్ షాపింగ్‌కి గిరాకీ అధికమైందని, మారుమూల ప్రాంతాల్లో సైతం అమ్మకాలు వేగవంతంగా ఉన్నట్టు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ అమ్మకాలు గతేడాది కంటే 40 శాతం పెరిగాయి.
ఖరీదైన వస్తువులు ఎక్కువగా అమ్ముడైనట్టు గమనించామని కంపెనీ వివరించింది. అంతేకాకుండా రూ. 1 ముందస్తు చెల్లింపు ద్వారా 20 లక్షలకు పైగా వినియోగదారులు 50 లక్షల ఉత్పత్తులను బుక్ చేసుకున్నారని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. చాలామంది స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్ఛేంజ్ చేసుకునేందుకు ఆసక్తి చూపించారని, 83 శాతం ఈ విధానం కోసం ప్రీపెయిడ్ పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకున్నట్టు తెలిపింది. తర్వాతి విభాగంలో ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలకు ఎక్కువమంది కొనేందుకు సిద్ధపడినట్టు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.