విజయానికి చేరువలో బైడెన్

by Anukaran |
విజయానికి చేరువలో బైడెన్
X

దిశ, వెబ్‎డెస్క్:
అమెరికా అధ్యక్ష పోరు ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌, జో బైడెన్‌ హోరాహోరీగా తలపడుతున్నారు. అయితే డెమొక్రటిక్‌ అభ్యర్థి బైడెన్‌ మ్యాజిక్ ఫిగర్ 270కి చేరువలో ఉన్నారు. 264 ఎలక్టోరల్‌ ఓట్లతో బైడెన్ ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం ట్రంప్‌ 214 ఓట్లు సాధించారు. ఇప్పటివరకు 44 రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడ్డాయి. ఈ నెల 12 తర్వాతే నార్త్ కరోలినా ఫలితాలు వెలువడనుంది. నార్త కరోలినాలో ట్రంప్ 7 వేలకు పైగా ఓట్ల అధిక్యంలో ఉన్నారు. అలాస్కాలో మరో వారం రోజుల పాటు కౌంటింగ్ కొనసాగనుంది.

Advertisement

Next Story