ఢిల్లీకి వెళ్లి.. మోడీని కలుస్తా

by Shyam |
ఢిల్లీకి వెళ్లి.. మోడీని కలుస్తా
X

దిశ, ఆదిలాబాద్: ఆరోగ్యమైన భారతావని కోసం ఓ విద్యార్థి సైకిల్ యాత్ర చేపట్టాడు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకూ సుమారు 1600 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేపట్టి ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని సంకల్పం పెట్టుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన పెరంబదూర్ సుమంత్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి ఆదివారం హైదరాబాద్ నుంచి బయలుదేరి సోమవారం నిర్మల్‌కు చేరుకున్నాడు. నిర్మల్ సమీపంలోని మహబూబ్‌ ఘాట్ వద్ద సుమంత్ సైకిల్ జాతీయ జెండా పట్టుకుని ఢిల్లీ వెళ్తుండగా కలిశాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రతివ్యక్తి తన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇందుకు తన యాత్ర ఉపయోగపడుతుందని భావిస్తున్నానన్నారు. సుమారు 12రోజులపాటు సాగే తన సైకిల్ యాత్రతో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తానని చెప్పారు. ఢిల్లీలో ఉన్న తన మిత్రులతో కలిసి జాతీయ ఆరోగ్యశాఖ మంత్రిని కలుస్తానని, అవకాశం కల్పిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలుస్తానని చెప్పారు. దేశ ప్రజల ఆరోగ్య సంకల్పంతో తన సైకిల్ యాత్ర ద్వారా అవగాహన కల్పిస్తున్న సుమంత్ ఆదర్శప్రాయుడే అని పలువురు అభినందిస్తున్నారు.

Advertisement

Next Story