కిషన్ రెడ్డి గారూ.. ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోండి: అఖిలప్రియ

by srinivas |
కిషన్ రెడ్డి గారూ.. ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోండి: అఖిలప్రియ
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న జిల్లా కర్నూలు. ఈ జిల్లాలోనే ఏపీలో అత్యధికంగా పావువంతు కరోనా కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ అక్కడి ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాల నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. కర్నూలులో కరోనా ప్రబలడానికి కారణం అక్కడి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అని టీడీపీ నేత భూమా అఖిల ప్రియ ఆరోపించడంతో ఆయన రంగంలోకి దిగి.. ఆమె నిరూపిస్తే సెంటర్‌లో ఉరేసుకుంటానని సవాలు విసిరారు.

ఆ వివాదం సద్దుమణగకముందే మరో ఆరోపణతో ఆమె వీడియో ద్వారా బయటకు వచ్చారు. కర్నూలు జిల్లాలో ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతూ, లాక్‌డౌన్ ఉల్లంఘనలు చేస్తూ సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ మాధ్యమంగా కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఆ వివరాల్లోకి వెళ్తే…

‘కరోనా వ్యాప్తి నేపథ్యంలో కర్నూలు చాలా ప్రమాదంలో ఉంది.. ప్రతిరోజు మనుషులు చనిపోతున్నారు.. క్వారంటైన్‌కు వెళుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సభను జరపడానికి నంద్యాల ఎంపీ, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారు? కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి గారు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి వైఎస్సార్సీపీ నేతలు నిర్వహించిన సమావేశం ఫొటోను జత చేశారు.

tags: tdp, ysrcp, bhuma akhila priya, twitter, bjp, kishanreddy

Advertisement

Next Story