- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ ఫ్యాన్స్‌కు హాట్ న్యూస్.. భీమ్లా నాయక్‌పై సూపర్ అప్ డేట్
దిశ, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్. ఇందులో రానా కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అభిమానులంతా ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం వారి దిమ్మతిరిగిపోయే వార్త ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. భీమ్లా నాయక్‌కు ఇక 8 రోజులే అంటూ సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 22న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.
అసలు విషయానికి వస్తే.. భీమ్లా నాయక్ సినిమా చిత్రీకరణ శరవేగంగా దూసుకుపోతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ షూటింగ్ మరో 8 రోజుల్లో పూర్తవుతుందట. అనంతరం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఇండస్ట్రీ సర్కిల్స్‌లోనూ ఇదే హాట్ టాపిక్. దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో మేకర్స్ ఏమైనా ప్రకటిస్తారేమో చూడాలి.