- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి నిరంజన్ రెడ్డి పద్ధతి మార్చుకో.. జై భీమ్ ఫౌండర్ హెచ్చరిక
దిశ, నాగర్ కర్నూల్: ప్రాణాలకు తెగించి ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో గొర్రెలు, బర్రెలు, హమాలి పని చేసుకొని బతకడానికి కాదన్న విషయాన్ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గుర్తించాలని, ఇప్పటికైనా నిరుద్యోగులపై చేసిన చులకన వ్యాఖ్యలను మంత్రి వెనక్కి తీసుకోవాలని జై భీమ్ అసోసియేషన్ ఫౌండర్ ముకురాల శ్రీహరి శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. మంత్రి మాట్లాడిన మాటలను ప్రసారం చేసిన మీడియాను బెదిరిస్తూ అక్రమ కేసులు బనాయించడం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. కేసులు పెట్టేముందు సమావేశంలో అధికారులు రికార్డ్ చేసిన వీడియోలో చూసుకోవాలన్నారు. నిరుద్యోగుల పక్షాన నిస్వార్థంగా పని చేస్తున్న జర్నలిస్టుల కోసం జై భీమ్ యూత్ పోరాడేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి తన పంథాను మార్చుకుని చేసిన తప్పును ఒప్పుకుని నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.