ఆ మంత్రి ఓ డమ్మీ

by Shyam |
ఆ మంత్రి ఓ డమ్మీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే సీఎం కేసీఆర్ కనబడకుండా పోయారని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. లాక్ డౌన్ కాలంలో సామాన్యులపై కరెంట్ బిల్లుల భారం మోపడం దారుణమన్నారు. బిల్లులను తగ్గించమని అడుగుదామన్నా కేసీఆర్ అందుబాటులో లేరని విమర్శించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఓ డమ్మీ అని ఎద్దేవా చేశారు. అయన సీఎం కేసీఆర్‌కు సేవ చేయడం తప్ప ప్రజా సమస్యలు పట్టవన్నారు. విద్యుత్ బిల్లులపై ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామని ఈ సందర్భంగా భట్టి హెచ్చరించారు.

Advertisement

Next Story