- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
11న భారతీ ఇన్‌ఫ్రాటెల్ బోర్డు సమావేశం!
దిశ, వెబ్‌డెస్క్: టెలికాం మౌలిక సదుపాయాల కంపెనీ భారతీ ఇన్‌ఫ్రాటెల్ బోర్డు సమావేశం ఈ నెల 11న ఉంటుందని, ఇండస్ టవర్స్ విలీనంపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు వెల్లడించింది. విలీనం పూర్తవుతుందనే దానిపై స్పష్టత లేదని పేర్కొంది. రెండు కంపెనీలకు ఎప్పుడైనా విలీన పథకాన్ని ముగించడం లేదంటే ఉపసంహరించుకునే హక్కు ఉందని తెలిపింది. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో భారతీ ఎయిర్‌టెల్, ఇండస్ టవర్స్ మధ్య ‘స్కీమ్ ఆఫ్ అరెంజ్‌మెంట్’ పరిస్థితిని డైరెక్టర్లు పరిశీలించారు. ఈ నెల 11న జరగనున్న తదుపరి సమావేశంలో కంపెనీ, వాటాదార్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోనున్నట్టు బోల్డు స్పష్టం చేసింది. అంతకుముందు ఏప్రిల్ 23న జరిగిన బోర్డు సమావేసంలో పథకం గడువును జూన్ 24 దాకా పొడిగిస్తున్నట్టు, రెండు కంపెనీల్లో ఎవరికైనా ఎప్పుడైనా పథకాన్ని ఉపసంహరించుకునే హక్కు ఉంటుందని నిర్ణయించారు. దీని ప్రకారం..విలీనం అయిపోతుందనే స్పష్టం ఇవ్వలేమని తెలిపింది. ఇండస్ టవర్స్‌లో భారతీ ఎయిర్‌టెల్‌కు 42 శాతం వాటా ఉంది. ఎయిర్‌టెల్‌తో పాటు బ్రిటన్ టెలికాం వొడాఫోన్ కంపెనీకి 42 శాతం, వొడాఫోన్ ఐడియా కంపెనీకి 11.15 శాతం ఇండస్ టవర్స్‌లో వాటాలున్నాయి.