క్లౌడ్ కమ్యూనికేషన్ మార్కెట్లోకి ఎయిర్‌టెల్

by Harish |
క్లౌడ్ కమ్యూనికేషన్ మార్కెట్లోకి ఎయిర్‌టెల్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఇటీవల అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్లౌడ్ కమ్యూనికేషన్ మార్కెట్లోకి అడుగుపెడుతున్నట్టు సోమవారం ప్రకటించింది. దీనికోసం ‘ఎయిర్‌టెల్ ఐక్యూ’ అనే కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఇది భారత కమ్యూనికేషన్‌లో విప్లవాత్మక మార్పుగా ఎయిర్‌టెల్ అభివర్ణించింది.

ప్రస్తుతం భారత్‌లో క్లౌడ్ కమ్యూనికేషన్ మార్కెట్ విలువ సుమారు రూ. 7,400 కోట్లుగా ఉంది. ఇది ప్రతి సంవత్సరం 20 శాతం వృద్ధి సాధిస్తోంది. ఇదివరకే ఎయిర్ ఐక్యూ సేవల కోస అర్బన్ కంపెనీ, స్విగ్గీ, రాపిడో, జస్ట్ డయల్ సంస్థలు బీటా వెర్షన్‌ను వినియోగిస్తున్నాయి. తాజాగా ఇది వాణిజ్యపరంగా అందుబాటులోకి రానుంది. ఎయిర్‌టెల్ ఐక్యూ ప్లాట్‌ఫామ్ ‘పే యాజ్ యూ గో’ మోడల్‌లో సేవలను అందిస్తోంది. ఈ సరికొత్త ఎయిర్‌టెల్ ఐక్యూ ద్వారా కంపెనీలు సుమారు 40 శాతం ఖర్చులను తగ్గించుకోవచ్చని ఎయిర్‌టెల్ బిజినెస్ డైరెక్టర్ అజయ్ చిత్కారా చెప్పారు.

Advertisement

Next Story