రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అరాచ‌కం

by Sridhar Babu |
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అరాచ‌కం
X

దిశ, కొత్తగూడెం: వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు దాడి చేయ‌డాన్ని పాల్వంచ భారతీయ జనతా పార్టీ నాయ‌కులు తీవ్రంగా ఖండించారు. స్థానిక ద‌మ్మ‌పేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశారు. అనంత‌రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి విలేక‌రుల సమావేశంలో మాట్లాడుతూ… రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఆగడాలు, అకృత్యాలు, రౌడీలను తలపించే విధంగా ఉన్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో ఎంపీలకు కూడా రక్షణ కరువైందన్నారు. ఎంపీ అరవింద్‌పై టీఆర్‌ఎస్‌ అనుచరులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు.

Advertisement

Next Story

Most Viewed